logo

ఇండిగో సంక్షోభంపై రంగంలోకి దిగిన ప్రధాని మోదీ

ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడి పనితీరుపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానయాన శాఖ అధికారులతో నేరుగా మోదీ సమీక్షించారు.
ఇండిగో సంక్షోభంపై మోదీకి అధికారులు బ్రీఫింగ్‌ ఇచ్చారు. అయితే, సమీక్షకు కేంద్రమంత్రి రామ్మోహన్‌ను పీఎంవో పిలవలేదని సమాచారం.

పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌ నాయుడు ఘోరంగా విఫలమయ్యారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చేతకానితనంతో దేశ ఏవియేషన్‌ రంగంలో పెను సంక్షోభం నెలకొందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇండిగో సంక్షోభాన్ని చివరి వరకు రామ్మోహన్‌ పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగా, ఇండిగో సంస్థపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానాల ఆకస్మిక రద్దు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై సీరియస్‌ అయ్యింది. ప్రయాణికుల టికెట్ రద్దు రీఫండ్‌ను ఆలస్యం చెయవద్దని.. రేపు రాత్రి 8లోపు డబ్బులు తిరిగివ్వాలని తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు, ఉద్దేశపూర్వకంగానే విమానాల సంక్షోభం సృష్డించి దానికి డీజీసీఏ నిబంధనలు సాకుగా చూపుతుందని ఆరోపించింది. రద్దైన విమానాల సమాచారం కోసం వెంటనే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఇండిగోకు ఆదేశాలు జారీ చేసింది.

0
88 views