logo

డా.బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన విద్యార్థి నాయకులు.

వెలుగోడు (AIMA MEDIA): స్థానిక వెలుగోడు మండలం జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ నందు బహుజన స్టూడెంటు అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పాలుట్ల రమణ మరియు జిల్లా అధ్యక్షులు డి.పెద్ద స్వామి మాట్లాడుతూ* భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన భారతదేశానికి చేసిన సేవలను గుర్తించుకొని భారత దేశ ప్రజల కోసము అహర్నిశలు కృషి చేసి భారత రాజ్యాంగాన్ని దేశ అభివృద్ధి కోసం రాసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆయన చేసిన సేవలను ఎన్నటికీ దేశం మరిచిపోదని వారు కొనియాడారు. అలాగే దళితుల అభ్యున్నతి కోసం దళితుల రాజకీయ ఎదుగుదల కోసం అనేక చట్టాలను ఆర్టికల్స్ భారత రాజ్యాంగ మందు రూపొందించి విచ్చిన్న జాతుల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేయడం జరిగిందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ మరియు రామకృష్ణ, టీచర్లు మరియు, విద్యార్థులు పాల్గొన్నారు.

0
0 views