logo

అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్దాం - రాజ్యాంగాన్ని కాపాడుకుందాం...

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాజాం మండల కమిటీ ఆధ్వర్యంలో రాజాం కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి జె.రవికుమార్ మరియు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.రమేష్ మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా రాజ్యాంగంపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని,దీని ప్రభావం విద్యార్థులపై చూపుతోందని తెలిపారు. దీనిలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు హక్కుల కోసం ప్రశ్నించే వారిపై ప్రజాస్వామ్య హక్కులను కాల రాసే విధంగా అణిచివేతలకు గురించేయ్యడం. ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో లౌకికవాదానికి వ్యతిరేకంగా మతోన్మాద భావనలు పెంచే విధంగా చరిత్రను వక్రీకరిస్తూ విద్యార్థులకు నష్టం కలిగించే విద్యా విధానాలను బలవంతంగా అమలు చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుందని. రాజ్యాంగం దేనికోసమైతే నిర్మితమైందో దానికి విభిన్నంగా పెట్టుబడీదారులకు, రాజకీయ వేత్తలకు, మతోన్మాదులకు అనుకూలమైన విధానాలను తెచ్చే ప్రయత్నాలు ఈరోజు జరుగుతున్నాయని. కాబట్టి భారతదేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య ఘనతంత్ర రాజ్యం గా నిర్మించుకోవాలంటే విద్యార్థులు, ప్రజలు రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దాని కొరకు ఎస్ఎఫ్ఐ చేసే పోరాటాలకు, హక్కుల సాధనకై అందరూ కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు వై.నాని , కళాశాల యాజమాన్యం,మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు...

5
302 views