
ఆర్జీఎం లో అంతర్జాతీయ స్థాయి ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం ప్రారంభం.
పాణ్యం (AIMA MEDIA): పాణ్యం మండలం ఆర్జీయమ్ ఇంజనీరింగ్ కళాశాల లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం ను ప్రఖ్యాత భారత బ్యాడ్మింటన్ ఆటగాడు, అర్జున అవార్డు గ్రహీత, మాజీ జాతీయ ఛాంపియన్ బి. చేతన్ ఆనంద్ శనివారం ప్రారంభించారు. చేతన్ ఆనంద్ 4 సార్లు జాతీయ ఛాంపియన్ గా మరియు 3 సార్లు దక్షిణాసియా క్రీడల పురుషుల సింగిల్స్ ఛాంపియన్, గా కెరీర్‌లో అత్యుత్తమ ప్రపంచ ర్యాంకింగ్ 10 సాధించి బ్యాడ్మింటన్ లో భారత్ కీర్తి ని చాటి చెప్పిన చేతన్ ఆనంద్ ఒలింపిక్స్ మరియు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లతో సహా అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు ఈ సందర్భంగా చేతన్ ఆనంద్ మాట్లాడుతూ ఆర్జీఎం విద్యాసంస్థలు ఎన్నో వ్యప్రయాసల కోర్చి అంతర్జాతీయ స్థాయిలో ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం నిర్మించడం అభినందనీయమని అన్నారు.భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు పుట్టుకొస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ ప్రారంభ కార్యక్రమంలో ఆర్జీఎం విద్యాసంస్థల ఎండి ఎం శివరామ్ డీన్ డాక్టర్ డి వి అశోక్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి జయ చంద్ర ప్రసాద్,- శాంతి రాం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సుబ్రమణ్యం, శాంతి రాం ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్,డాక్టర్ సి మధుసూధన చెట్టి, కళాశాల అధ్యాపకులు జెఎన్టీయూ అనంతపూర్ స్థాయిలో బెస్ట్ ఫిజికల్ డైరెక్టర్ అవార్డు గ్రహిత పి వెంకటేష్,శాంతిరామ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుండ ఫిజికల్ డైరెక్టర్లు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.