logo

శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఆరవ రోజు స్పెషల్ క్యాంప్.

నంద్యాల (AIMA MEDIA): శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఆరవ రోజు స్పెషల్ క్యాంపు స్థానిక వడ్డుగండ్ల గ్రామంలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సుబ్రహ్మణ్యం తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సేంద్రియ వ్యవసాయం మరియు వర్షపు నీటి సంరక్షణ పై అవగాహన సదస్సు ఇంటింటికి వెళ్లి గ్రామస్తులతో చర్చించారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా, పంట పొలంలో సహజమైన ఎరువులు (ఆవు పేడ, కంపోస్ట్), పంట మార్పిడి వంటి పద్ధతులు ఉపయోగించి, భూమిని, పర్యావరణాన్ని కాపాడుతూ పంటలు పండించాలని తెలిపారు. ఇది జీవవైవిధ్యాన్ని పెంచి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఒక సంప్రదాయ పద్ధతి అని తెలియచేశారు. అదేవిధంగా పైకప్పులు, రోడ్లు మొదలైన ప్రదేశాల నుండి వర్షపు నీటిని సేకరించి, నిల్వ చేసి, అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం వల్ల నీటి సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నాగరాజు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

7
202 views