logo

*జాతీయ రాజ్యాంగ దినోత్సవం ముగింపు సభలో న్యాయవాదులకు ఘన సన్మానం*



*తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో న్యాయవాది సన్నిధానం కృష్ణశర్మకు విశిష్ట సత్కారం*

జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో, న్యాయరంగంలో ప్రతిభ కనబరిచిన ప్రముఖ న్యాయవాదులను తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా షాద్‌నగర్ పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది *సన్నిధానం కృష్ణశర్మ* గారిని శాలువాతో సత్కరించి, మెమొంటో అందజేశారు.
30 ఏళ్ల నిరంతర న్యాయ సేవ, ప్రభుత్వ ప్లీడరుగా చేసిన విశేష సేవలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఉచిత న్యాయసలహాలు అందిస్తూ అనేక సమస్యలకు చట్టపరమైన పరిష్కారాలు చూపడం వంటి అంశాలు ఆయన సత్కారానికి కారణమయ్యాయి.
కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డా. రాజ్ నారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జస్టిస్ గౌరవ శ్రీమతి సూర్యపల్లి నంద, జస్టిస్ వామన్‌రావు, జస్టిస్ పి.వి. సోమయాజులు, జస్టిస్ జస్వంత్, జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, జస్టిస్ శ్యాంప్రసాద్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయవాదులు, న్యాయ కళాశాలల ప్రొఫెసర్లు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా సత్కరించబడ్డారు.
*ఈ సన్మానం నా బాధ్యతను మరింత పెంచింది ... సన్నిధానం కృష్ణశర్మ*
*సత్కారం* అనంతరం న్యాయవాది కృష్ణశర్మ మాట్లాడుతూ..
“న్యాయవాద వృత్తిలో కష్టపడి పని చేస్తే విజయం తప్పదు. రాజ్యాంగం ప్రజల హక్కులను కాపాడేందుకు ఇచ్చిన గొప్ప ఆయుధం. ఆ రాజ్యాంగ స్పూర్తిని ప్రజలకు చేరవేయటం, హక్కులపై అవగాహన కల్పించడం ప్రతి న్యాయవాది బాధ్యత” అని పేర్కొన్నారు.
న్యాయరంగంలో కొత్త కొత్త పరిజ్ఞానం నేర్చుకుంటూ, నిరంతరం విద్యార్థిలా ముందుకు సాగితే ప్రజల నమ్మకం – గౌరవాన్ని సంపాదించగలమన్నారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ చేసిన సన్మానం తన వృత్తి జీవితంలో మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు.
(అల్వాల దర్శన్ గౌడ్ Dg✍️)

0
0 views