logo

*ఆత్రం సుగుణక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కార్యకర్తలు*




రెబ్బెన: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై శనివారం కాంగ్రెస్‌లో చేరారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లావుడ్యా రమేష్ ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమంలో కొత్తగా వచ్చిన వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన, అభివృద్ధి పథకాలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, బీఆర్ఎస్‌ను వదిలి కాంగ్రెస్ వైపు పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ఇలాంటి చేరికలు మరింత ఊపునిస్తాయని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

*డీసీసీ కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్*

0
88 views