logo

*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకై అందరం కలిసికట్టుగా పోరాడుదాం*



👉 బొబ్బిలి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే సతీష్ కుమార్
👉 బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం
👉 రోగులకు పళ్ళు మరియు బ్రెడ్లు పంపిణీ
👉 ఎమ్మార్పీఎస్ మరియు ప్రజా సంకల్ప వేదిక( మానవ హక్కుల విభాగం)ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ

బొబ్బిలి, డిసెంబర్ 06:-
నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారత మాజీ న్యాయశాఖ మాత్యులు, భారతరత్న,బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,69 వ వర్ధంతి కార్యక్రమం బొబ్బిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొబ్బిలి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కటకం సతీష్ కుమార్ హాజరయ్యారు.ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అందరూ ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిఐ కే సతీష్ కుమార్ మాట్లాడుతూ,ఈరోజు భారతదేశంలో మనందరం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ, అందరూ సమానంగా, సోదరుభావంగా, కులమత బేధాలు లేకుండా, జీవిస్తున్నాము అంటే, అది కేవలం భారత రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందని, అటువంటి మహోన్నతమైన రాజ్యాంగాన్ని రచించి మనకు అందించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.అలాంటి మహానుభావుడు యొక్క వర్ధంతి వేడుకలు మనం జరుపుకోవడం చాలా గొప్ప విషయం అని అన్నారు.అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.దేశంలో ఉన్న ప్రజలందరూ సోదర భావంతో, ఐకమత్యంతో మెలగాలనే సంకల్పం ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే నెరవేరుతుందని అన్నారు.ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బొద్దాన అప్పారావు మరియు ప్రజా సంకల్ప వేదిక మానవ హక్కుల విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోన మానస కూడా మాట్లాడుతూ, ఆయన జీవితం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న గర్భిణీలకు మరియు రోగులకు పళ్ళు మరియు బ్రెడ్లను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ రవిశంకర్, డాక్టర్ రాజా రమేష్,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బొద్దాన అప్పారావు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ చదలవాడ సత్యనారాయణ,సీనియర్ పాత్రికేయులు పొట్నూరు రాజ్ కిరణ్,ఎమ్మార్పీఎస్ బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ రాము,ఎమ్మార్పీఎస్ నాయకులు కింతలి చిన్న, కింతలి చంటి,కింతల శ్రీను, కింతల్ పవన్,మురళి,ప్రజా సంకల్ప వేదిక మానవ హక్కుల విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోన మానస,సభ్యులు బిగులు లక్ష్మీ,చీమల గౌరీ,దిబ్బ కళ్యాణ్,బంగారి కిషోర్ ,మదర్ తెరిసా ట్రస్ట్ క్లైవ్ కూపర్,ఆసుపత్రి సిబ్బంది మరియు అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు.

*రాజ్ కిరణ్*✍️

0
25 views