logo

అటల్ సంకల్ప్ – మోడీ సిద్ధి యాత్రను జయప్రదం చేయండి. బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి.


మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ శత జయంతి పురస్కరించుకొని ఈ నెల 11 నుంచి 25 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న అటల్ సంకల్ప్ – మోడీ సిద్ధి యాత్ర ఈ నెల 15 న ప్రకాశం జిల్లాలో జరగనుందని ఏపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా జరుగు యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ గారు భారత రాజకీయాల్లో దూరదృష్టి, సమన్వయభావానికి ప్రతీకని, ఆయన కలలు కన్న సుజలాం,సుఫలాం భారత్.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో సాకారమవుతుందని అన్నారు.

ఈ సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి, బీజేపీ పాలనలో అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర ఎంతో కీలకం అని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో జరగనున్న కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల నుంచి పట్టణాల దాకా ప్రజల్లో ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనహిత కార్యాచరణను ప్రజలకు చేరవేయడమే ఈ యాత్ర లక్ష్యమని రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ యాత్రలో భాగంగా పాదయాత్రలు, ప్రజా సమావేశాలు, ఇంటింటి ప్రచారం, అటల్ జీ జీవితచరిత్ర, మోడీ ప్రభుత్వ ఆవిష్కరణలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏపి రాష్ట్ర బిజెపి మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు.

0
58 views