ఆర్.జీ.యం అండ్ శాంతిరామ్ గ్రూప్ చైర్మన్ డా.శాంతిరాముడు చేత బంగారు పతకాన్ని అందుకున్న డా. యం.కవిత.
నంద్యాల (AIMA MEDIA ): శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్, నంద్యాలలో సైకియాట్రీ విభాగానికి చెందిన ఉత్తమ అవుట్ గోయింగ్ పీజీ విద్యార్థికి 2024 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం బంగారు పతకం అందించే కార్యక్రమాన్ని సైకియాట్రీ విభాగాధిపతి డా. పి. ఎస్. మూర్తి స్పాన్సర్‌గా ప్రారంభించారు.2025 సంవత్సరానికి గాను డా. పి. ఎస్. మూర్తి బెస్ట్ అవుట్ గోయింగ్ పీజీ గోల్డ్ మెడల్ను సైకియాట్రీ విభాగానికి యం.కవితకు శనివారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.జీ.యం అండ్ శాంతిరామ్ గ్రూప్ చైర్మన్ డా. ఎం. శాంతిరాముడు డా. యం.కవితకు బంగారు పతకాన్ని అందించి ఆమెను అభినందించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డా. ఎం. మాధవి లత, ప్రిన్సిపల్ డా. వసంత్ ఆర్. చవాన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. యం.రాఘురాం, మేనేజింగ్ డైరెక్టర్ డా. పి. రవిబాబు, మెడికల్ సూపరింటెండెంట్ డా. ఎం. మధుసూధన్ రెడ్డి, ఆర్.ఎం.ఓ డా. కె. నరేంద్రుడు పాల్గొని డా. యం.కవితను అభినందించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.