logo

మహిళలకు స్పూర్తి ప్రధాత డా.బాబాసాహేబ్ అంబేద్కర్.

కర్నూల్ (AIMA MEDIA): మహిళలకు స్పూర్తి ప్రధాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ గారు అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. ప్రపంచ మేధావి, బహుజనుల ఆరాధ్య దైవం, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69 వ వర్థంతి కర్నూలు జిల్లా మద్దూరు నగరు నందు గల యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి బాబాసాహేబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ హిందూకోడ్ బిల్లు ద్వారా సమాజంలో మహిళకు సముచిత స్థానం కల్పించేందుకు సమాన హక్కులు కల్పించేందుకు అంబేద్కర్ గారు చేసిన కృషి మరువలేనిదని, హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు స్పూర్తి ప్రధాతగా చరిత్రలోనే కాకుండా మహిళల జీవితాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి ఆదర్శనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆమె అన్నారు.

4
100 views