
(ఎయిమ్)అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి:---
గుర్లలలో మహనీయునికి ఘన నివాళి అర్పించిన:--- చీపురుపల్లి.డి.ఎస్. పి. ఎస్. రాఘవులు.
(AIM)ఎయిమ్ జిల్లా కన్వీనర్ కెల్ల.భీమారావు.అధ్యక్షత న ఈ కార్యక్రమం జరిగింది
భారత రాజ్యాంగం నిర్మాత, ప్రపంచం మేధావి, ప్రజా హక్కులు ప్రధాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69.వ వర్ధంతి. కార్యక్రమం జరిగింది.
అందులో భాగంగా .గుర్ల మండలం ఆఫీస్ వద్ద అంబేద్కర్ విగ్రహం నకు ఘనంగా నివాళులు అర్పిస్తున్న విజయనగరం జిల్లా అంబేద్కర్స్ ఇండియా మిషన్ (AIM )
జిల్లా కన్వీనర్ కెల్ల భీమారావు.
పలువురు జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ అంటూ నినాదాలు తెలియజేశారు.
అనంతరం. డి.ఎస్.పి. ఎస్. రాఘవులు. ఎయిమ్ జిల్లా కన్వీనర్ కెల్ల. భీమారావు. ఇరువురు మాట్లాడు తూ
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికీ శరణ్యం అని డాక్టర్ బాబాసాహెబ్
అంబేద్కర్ కొందరు వారు కాదు అందరు వారు అన్నారు
భారత దేశ ప్రజలు కు హక్కులు కల్పించిన హక్కులు ప్రధాత. అలాగే స్త్రీ లు నేడు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాజ్యాంగబద్ధమైన పదవులను అయితేనేమి ఉన్నతమైన ఉద్యోగాలు అయితేనేమి పురుషులతో సమానంగా పొందగలుగుతున్నారంటే దానికి ప్రధాన కారణం ఆయన రాజ్యాంగంలో పొందపరిచిన. శాసనాల వలన తప్ప మరి దేని వలన కాదు. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి విద్యా వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వాలదనే విషయం ను గుర్తు చేశారు
రాజ్యాంగం లో కుల మత, లింగం, ప్రాంతం బేధం లేకుండా రాజ్యాంగం లో ప్రజలు అందరికి సమాన హక్కులు కల్పించారని అన్నారు. నేడు దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారు అంటే కేవలం ఆయన కృషి ఫలితమేనని. కనుక ప్రజలందరూ ఆయన యొక్క వర్ధంతిని దేశానికి ఆయన చేసిన సేవలను స్మరణకు తెచ్చుకోవాలని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సీ.ఐ.జి. శంకరరావు. గుర్ల మండల. తాసిల్దార్ పి ఆదిలక్ష్మి.గుర్ల మండలం ఎయిమ్ (AIM)కన్వీనర్.తలే. నారాయణప్పడు.గుర్ల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్. పి. నారాయణరావు.ఎం.ఇ. ఓ. పి. భానుప్రకాష్.ఉపాధి హామీ. ఏ.పీ.ఓ. రత్నమాల. గుర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి ఎ. తిరుపతి రావు. సీడీపీఓ. ఆరుద్ర. ఎంపీడీఓ.ఆఫీస్ సూపరిండెంట్ . ఏ. వరప్రసాద్. గుర్ల మండల ఎయిమ్ (AIM) సైనికులు.వివిధ గ్రామాల ఎయిమ్ కన్వీనర్ లు కమిటీ సభ్యులు మండల అధికారులు మహిళలు పాల్గొన్నారు.