దుబాయ్ యూత్ పారా గేమ్స్‌కు విజయనగరం యువకెరటం: పొట్నూరు ప్రేమ్ చంద్ ఎంపిక!
దుబాయ్ వేదికగా ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు జరుగబోయే ఆసియన్ యూత్ పారా గేమ్కు విజయనగరం జిల్లాకు చెందిన పొట్నూరు ప్రేమ్ చంద్ ఎంపికయ్యాడు. ఇది జిల్లాకు దక్కిన అరుదైన అవకాశమని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.దయానంద్ హర్షం వ్యక్తం చేశారు. ప్రేమ్ చంద్ ఎంపిక పట్ల కలెక్టర్ రాంసుందర రెడ్డి, జేసీ సేథు మాధవన్, జిల్లా క్రీడాధికారి ఎస్.వెంకటేశ్వసరరావులు అభినందనలు తెలిపారు.