అయ్యప్ప యాత్రలో విషాదం: విజయనగరం భక్తులను బలిగొన్న 'నిద్రలో ప్రమాదం'
మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఉహించలేరు. విజయనగరం జిల్లాకు చెందిన పలువురు స్వాములు అయ్యప్పకు ఇరుముడి సమర్పించారు. అనంతరం శబరిమల నుంచి కారులో తిరుగుపయనమయ్యారు. రాత్రి ప్రయాణం ప్రమాదమని భావించి రామేశ్వరం వద్ద రోడ్డు పక్కన వాహనం ఆపారు. అందరూ నిద్రలో ఉండగా మృత్యు లారీ కారు మీదకు దూసుకు రావడంతో నలుగురు చనిపోయారు.
వీరి మరణ వార్త విన్న కుటుంబీకులు, గ్రామస్థులు విషాదంలో మునిగారు.