logo

విజయనగరంలో డ్రమ్స్ హోరు: శివమణి ప్రదర్శనకు మంత్రముగ్ధులైన సంగీత ప్రియులు!


ఘంటసాల స్మారక పురస్కారం అందుకునేందుకు విజయనగరానికి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసుడు శివమణి శుక్రవారం సాయంత్రం తన డ్రమ్స్ శబ్దాలతో మత్తెక్కించారు. వేదికపై డ్రమ్స్ వాయిస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. శివమణి ప్రదర్శనకు అభిమానులు, సంగీత ప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరై చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఘంటసాల కళా వారసత్వాన్ని స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివమణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

7
679 views