logo

గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు దాసరి శ్రీనివాస్ ఉస్మానియా విద్యార్థి

పవర్ తెలుగు దినపత్రిక: డిసెంబర్ 5 భీమారం మండలం ధర్మారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు మండలం, ధర్మారం గ్రామ పంచాయతీలో జరగనున్న ఎన్నికలకు గాను, శ్రీ దాసరి శ్రీనివాస్ గారు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ధర్మారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆయన ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ప్రజా సేవకు అంకితం
నామినేషన్ అనంతరం శ్రీ దాసరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, "ధర్మారం గ్రామంలోని రెడ్డిపల్లి ప్రతి కుటుంబం బాగుండాలనేదే నా లక్ష్యం. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, మెరుగైన విద్య, వైద్యం, మరియు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తాను. పారదర్శక పాలన అందించి, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తాను," అని అన్నారు.ఆశీస్సులు కోరి రెడ్డిపల్లి మరియు ధర్మారం గ్రామ అభివృద్ధికి తనను తాను అంకితం చేసుకుంటానని తెలియజేస్తూ, శ్రీనివాస్ గారు ధర్మారం రెడ్డిపల్లి గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. "గ్రామ ప్రజలందరూ, పెద్దలు, యువకులు, రైతులు, మహిళలు, మేధావులందరూ నా సేవలను గుర్తించి, వారి అమూల్యమైన ఓటును, ఆశీస్సులను అందించి నన్ను గెలిపించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను," అని విజ్ఞప్తి చేశారు.స్థానిక సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తిగా, గ్రామాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడేందుకు తాను సిద్ధంగా ఎల్లప్పుడూ ప్రజల్లో అందుబాటు ఉంటారని తెలిపారు

5
14 views