సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.
పాణ్యం (AIMA MEDIA): మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు పై అప్రమత్తంగా ఉండాలని ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సుబ్బయ్య పేర్కొన్నారు. శుక్రవారం శాంతిరాం ఫార్మసీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు పై నెరవాడ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ గ్రామంలోని యువకులకు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు వివరించారు. అలాగే సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసపూరిత సందేశాలు మీ చరవాణికి వస్తే వాటిని విస్మరించాలి అని వారికి వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. N.వై. సుబ్బయ్య, అధ్యాపకులు మహేశ్వర రెడ్డి, అన్వర్ హుస్సేన్, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.