logo

69 మందికి కంటి పరీక్షలు

AIMA MEDIA కొత్తూరు న్యూస్ :-

స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో గురువారం జిల్లా అంద్రత్వ నివారణా సంస్థ సహకారంతో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 69 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆప్తాలమిక్ అధికారి ఇప్పిలి జానకిరామయ్య తెలిపారు.
రాగోలు జేమ్స్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో ఎంపిక వీరందరికీ జేమ్స్ ఆసుపత్రికి తరలించి ఉచితంగా ఐఓఎల్ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా రోగులకు ఉచితంగా మందులను అందజేసినట్లు
ఆయన తెలిపారు. వీరికి
భోజన సౌకరం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జేమ్స్ పీఆర్ఓ రాము తదితరులు పాల్గొన్నారు.

8
380 views