భామిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నైట్ డ్యూటీ డాక్టర్లు నిర్లక్ష్యం... పట్టించుకొని అధికారులు
AIMA MEDIA న్యూస్:-
పార్వతీపురం మన్యం జిల్లా,భామిని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు పనిచేస్తున్నప్పటికీ, రాత్రి పూట డ్యూటీ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, ప్రసవాలు, అతి తక్షణ వైద్యసహాయం అవసరమైన సందర్భాల్లో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఇది ముఖ్యంగా బొడ్డగూడ, మూలగూడ మరియు పరిసర గిరిజన ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. రాత్రి సమయంలో వైద్యసేవలు అందుబాటులో లేకపోవడం వల్ల రోగులను వేరొక ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. దానివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుంది