జగద్గిరిగుట్ట: సాయి ఈశ్వర్కు బీఆర్ఎస్ నేతల నివాళులు
జగద్గిరిగుట్ట: సాయి ఈశ్వర్కు బీఆర్ఎస్ నేతల నివాళులు
బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీల వైఖరిని నిరసిస్తూ జగద్గిరిగుట్ట నివాసి సాయి ఈశ్వర్ గురువారం రాత్రి బోడుప్పల్లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేసి, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. సాయి ఈశ్వర్ మృతదేహానికి బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే వివేక్ సహా పలువురు నాయకులు నివాళులర్పించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.