logo

సర్పంచ్ బరిలో సామాజిక సేవకుడు డాక్టర్ సాప పండరి: SJWHRC సభ్యత్వానికి రాజీనామా:


SJWHRC సభ్యత్వానికి రాజీనామా:
ఆమోదం తెలిపిన నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్, నేషనల్ జనరల్ సెక్రెటరీ గంప హనుమా గౌడ్

సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ నందు కుబీర్ మండల చైర్మన్ గా పదవి బాధ్యతలను స్వీకరించి, పలు సామాజిక చురుకుగా చేయడమే కాకుండా""మత్తుకు యువత చిత్తు కావద్దు~ఆత్మహత్యలు నిరోధిద్దాం అంటూ విద్యార్థులలో మాదకద్రవ్యాల పై అవగాహన సదస్సులు నిర్వహించడం, ఎక్కడ ఏ పేదవారికి కష్టం వచ్చినా వారికి ఆసుపత్రులకు తీసుకువెళ్లడం, రైతుల గురించి పోరాటం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా పదోన్నతి పొంది మరెన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి డాక్టర్ సాప పండరి ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున గ్రామంలోని ప్రజల కోరిక మేరకు, అభిమానుల కొరకు సర్పంచ్ బరిలో ఉండటానికి సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారికి, నేషనల్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ గంప హనుమా గౌడ్ గారికి తన యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా అభ్యర్థించగా, వెంటనే స్పందించిన నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయకుమార్, నేషనల్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ గంప హనుమా గౌడ్ గారికి ఆర్గనైజేషన్ మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు. అంతేకాకుండా ముందు ముందు ఆర్గనైజేషన్ యొక్క అభివృద్ధి కొరకు తన వంతు సహకారం తప్పకుండా చేస్తానని తెలియజేశారు

0
0 views