logo

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి ఘన నివాళులర్పిద్దాం డిసెంబర్ 6 న మహా పరినీర్వాన్ దివాస్ *దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కషాపొగు జాన్*

తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** డిసెంబర్ 5 **(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి ఘన నివాళులర్పిద్దాం

డిసెంబర్ 6వ తేదీన మహా పరినీర్వాన్ దివాస్

దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కషాపొగు జాన్ .

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రల వ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా
ఇరు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాల్లో ప్రతి మండలంలో
అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా దళిత జర్నలిస్టు ఫోరం కుటుంబ సభ్యులకు ప్రకటనలో తెలియజేసిన దళిత జర్నలిస్టు పోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్, దళిత జర్నలిస్టు ఫోరం సెక్రెటరీ డేవిడ్ దళిత జర్నలిస్ట్ ఫోరంతెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి ప్రతి సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన మహా పరినీర్వాన్ దివాస్ ని పురస్కరించుకొని ఆయన మన దేశానికి చేసిన ఆదర్శప్రాయమైన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించడం జరుగుతుందని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క దళిత జర్నలిస్టు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించాలని కోరడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతిని సందర్భంగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాలని వారు పిలుపునిచ్చారు అంబేద్కర్ అందరికీ సమాన విద్యా ,ఆరోగ్యం, ఉపాధి, రక్షణ ,నివాసం భావ ప్రకటనకు సమన్యాయం రాజ్యాంగంలో పొందపరచిన భారత పితా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వారన్నారు సమ సమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ ను ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితి సింబల్ ఆఫ్ నాలెడ్జిగా గుర్తించారని వారన్నారు ఇటువంటి మహానుభావుని వర్ధంతిని మనం ఘనంగా నిర్వహించాలని వారు ఈ సందర్భంగా దళిత జర్నలిస్టులకు పిలుపునివ్వడం జరిగింది.

17
834 views