మన్యం జిల్లా భామిని మండల పర్యటనలో మంత్రి లోకేష్.. ఎమ్మెల్యే ఎంజీఆర్
AIMA న్యూస్ మన్యం జిల్లా :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ & ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ నారా లోకేష్ గారు భామిని మండల పర్యటన సందర్భంగా నియోజకవర్గం మొత్తం ఉత్సాహభరితంగా మారింది.పాతపట్నం నియోజకవర్గ కేంద్రం నుంచి బృహత్తర ర్యాలీగా ప్రారంభమైన స్వాగత యాత్ర హిరమండలం మండలం బ్యారేజ్ సెంటర్ మీదుగా, భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనడంతో విశేష ఆకర్షణగా నిలిచింది.తదుపరి కొత్తూరు మండలం ప్రధాన కూడలి వద్ద, స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు ఐదు మండలాల నాయకులు,కార్యకర్తలతో కలిసి మంత్రివర్యులకు ఘన స్వాగతం తెలిపారు.లోకేష్ గారిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి రావడంతో ర్యాలీ ఉత్సాహం మరింత పెరిగింది.అభివృద్ధి, విద్యా రంగం, ఐటి అవకాశాలపై ప్రజల్లో ఆశాజనకమైన వాతావరణం నెలకొంది.పర్యటన విజయవంతం కావడానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గోవిందరావు గారు కృతజ్ఞతలు తెలిపారు.*