
ముఖ్యమంత్రి-ఉపముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు.
నంద్యాల (శుభోదయం న్యూస్): ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు ఏడు వరాలు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం, సంఘం కార్యాలయంలో గురువారం అభినందన కార్యక్రమం నిర్వహించారు.నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు, తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ,రమణయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ 6000 కు పెంచి దివ్యాంగుల సంక్షేమానికి సహకరించారని, ఇప్పుడు ఇంద్రధనస్సు పేరుతో ప్రత్యేకంగా దివ్యాంగుల సమగ్ర అభివృద్ధికి ఏడు వరాలు ప్రకటించడం హర్షనీయమన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం, స్థానిక సంస్థల్లో,కార్పొరేషన్స్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధికి నామినేటెడ్ పదవి, ఆర్ధిక సబ్సిడీ పథకం,అన్ని క్రీడా కార్యక్రమాలు,టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు అందుబాటులో ఉంచుతామని,బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని, బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని,రెసిడెన్షియల్ స్కూల్స్,కాలేజీలు,హాస్టల్స్‌లో యుచదివే దివ్యాంగ విద్యార్ధులకు అదే చోట పెన్షన్ పంపిణీ చేస్తామని, అన్ని జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర స్థాయిలో అమరావతిలో ‘దివ్యాంగ్ భవన్’ లుఏర్పాటు చేస్తామని,దివ్యాంగులకు అనుకూలమైన, సౌకర్యవంతమైన రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని ప్రకటించి దివ్యాంగుల సంక్షేమానికి అభివృద్ధికి బాటలు పరచిన కూటమి ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లకు,నంద్యాల లో జరిగిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం లో దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తామని ప్రకటించిన రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ కు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం,జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ, రమణయ్య లతో పాటు సంఘం ప్రధాన కార్యదర్శి రాములింగం,ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి,వెంకటరావు, నిర్వాహక కార్యదర్శి మధు కుమార్, కార్యాలయ కార్యదర్శి మధు, కార్యవర్గ సభ్యులు మహాలక్ష్మమ్మ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.