logo

ఆల్ ఇండియా క్రీడా పోటీలకు శాంతిరాం ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంపిక.

పాణ్యం (AIMA MEDIA): స్థానిక నెరవాడ సమీపంలోని శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఆల్ ఇండియా పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సుబ్రమణ్యం తెలిపారు.డిసెంబర్ రెండవ తేదీన నిర్వహించిన జేఎన్టీయూఏ బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలలో కళాశాలకు చెందిన విద్యార్థులు సిఎస్సి విభాగానికి చెందిన ఉదయ్ కిరణ్ , శ్రీ వాణి, శ్రీలత, అలాగే డేటా సైన్స్ విద్యార్థిని జతిన్ అత్యంత ప్రతిభ కనబరిచి జేఎన్టీయూఏ యూనివర్సిటీ బాల్ బాడ్మింటన్ జుట్టుకు ఎంపికైనట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ తెలియజేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో క్రీడాకారులను కళాశాల ఎండి .ఎం. శివరాం క్రీడాకారులను అభినందించారు.ఈ కార్యక్రమంలో హెచ్ఓడీలు ఫరూక్ మరియు రమాదేవి పాల్గొన్నారు.

0
0 views