logo

ఈ నెల 15న హలో బీసీ చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్


కే.యూ బీసీ విద్యార్థి సంఘల జేఏసీ కో చైర్మన్ పి. రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ ఈనెల 15,16 తేదీలలో బీసీల చలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చి పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్ అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని, తెలంగాణలో రాష్ట్ర అసెంబ్లీలో చేసిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలని ప్రధాన డిమాండ్ తో బీసీ జేఏసీ అష్టంగా ఆందోళన కార్యక్రమాలలో భాగంగా బీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఈ నెల 15,16 తేదీలో నిర్వహించే తలపెట్టిన పార్లమెంట్ ముట్టడిని విజయవంతం చేయడం కోసం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు తరలిరావాలి వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ చెన్నం మల్లయ్య గారు,కే.యూ బీసీ జేఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మామిడి శెట్టి నాగరాజు, బీసీ విద్యార్థుల వేదిక జిల్లా కన్వీనర్ బాబు యాదవ్,బీసీ జేఏసీ యువజన రాష్ట్ర నాయకుడు చిర్ర సుమన్,కే.యూ బీసీ విద్యార్థి సంఘాల వైస్ చైర్మన్ ఆనంద్ నేత, కె.యూ బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు నరేష్ యాదవ్, ప్రమోద్ తదితరులు ఈ పోస్ట్ ఆవిష్కరణలో పాల్గొన్నారు

2
80 views