logo

రోలుగుంట ZPHS విద్యార్థుల ఎక్స్పోజర్ విజిట్: RARS అనకాపల్లి – బొజ్జన్నకొండ సందర్శనలు ఆకట్టుకున్నాయి

రోలుగుంట, అనకాపల్లి జిల్లా:
రోలుగుంట జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులు ఆదివారం నిర్వహించిన ఎక్స్పోజర్ విజిట్‌లో భాగంగా రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్(RARS), అనకాపల్లి మరియు చారిత్రక ప్రదేశం బొజ్జన్నకొండలను సందర్శించారు. మొత్తం 60 మంది విద్యార్థులు, 3 మంది ఉపాధ్యాయులు ఈ విద్యా ప్రయాణంలో పాల్గొన్నారు.
RARS అనకాపల్లి సందర్శన – శాస్త్రీయ వ్యవసాయంపై ప్రత్యక్ష అవగాహన
విద్యార్థులు RARSలో పరిశోధకుల మార్గదర్శకత్వంలో ఆధునిక వ్యవసాయ పరిశోధనలను పరిశీలించారు.
ఈ కేంద్రంలో ప్రధానంగా వరి, చెరకు, మినుములు, కంది వంటి పంటల అభివృద్ధి, రోగ నిరోధక రకాలు, నేల ఆరోగ్యం, బయోఫెర్టిలైజర్లు, బయోకంట్రోల్ పద్ధతులపై విశేష పరిశోధనలు జరుగుతాయి.
విద్యార్థులు ఆధునిక పంట సాంకేతికతలు,నీటి నిర్వహణ పద్ధతులు
,సేంద్రీయ సాగు విధానాలు,పురుగు–రోగ నియంత్రణ పరిశోధనలు,కొత్తగా అభివృద్ధి చేసిన పంట రకాల నమూనాలు అనేవి సమగ్రంగా తెలుసుకున్నారు.
పరిశోధకులు శాస్త్రీయ వ్యవసాయం భవిష్యత్ తరాలకు ఎంత అవసరమో విద్యార్థులకు వివరించారు
చారిత్రక బొజ్జన్నకొండ , బౌద్ధ నాగరికతకు ప్రత్యక్ష నిదర్శనం,విద్యార్థులు అనంతరం పురాతన బౌద్ధ పుణ్యక్షేత్రం బొజ్జన్నకొండను సందర్శించారు.
ఇక్కడి గుహలు, బౌద్ధ శిల్పాలు, స్తూపాలు, రాతి మండపాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి.
గైడ్ పురావస్తు ప్రాధాన్యత, బౌద్ధ ధ్యాన విధానాలు, ఆ కాలపు సంస్కృతి గురించి వివరణ ఇవ్వగా, విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు.ఉపాధ్యాయులు పేర్కొంటూ,“శాస్త్రీయ వ్యవసారం నుంచి చారిత్రిక అవగాహన వరకు రెండు వైపులా విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానం పెరిగింది. ఇలాంటి విజిట్లు విద్యార్థుల ఆలోచనా పరిధిని విస్తరింపజేస్తాయి” అన్నారు.ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులను అభినందిస్తూ,“విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, సాంస్కృతిక అవగాహన పెరుగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయి” అని అన్నారు.

0
708 views