logo

నందిగామ నియోజకవర్గం – ఐతవరం గ్రామంలో నూతన DDO కార్యాలయానికి శుభారంభం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ డిసెంబర్ 4 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

నందిగామ నియోజకవర్గంలోని ఐతవరం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన DDO (డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్) కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కలెక్టర్ లక్ష్మీశ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ: “దేశ ప్రగతికి పల్లెలే పట్టుకొమ్మలు” అనే మహాత్మా గాంధీజీ మాటలను ఆదర్శంగా తీసుకుని,
గ్రామీణ పరిపాలనను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు వేగవంతమైన సేవలను అందించడం లక్ష్యంగా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి & పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ నూతన కార్యాలయాలను ఏర్పాటు చేశారని తెలిపారు.
ఇందుకు వారికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే గత ప్రభుత్వంలో అమల్లో ఉన్న క్లస్టర్ విధానాన్ని రద్దు చేయడం ద్వారా గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించబడిందని, దీతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే కాకుండా పరిపాలన వేగవంతం అవుతుందని వివరించారు.
గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

3
133 views