తక్షణమే చెత్త తొలగించాలి చెత్తకు స్థలం కేటాయించాలి. సిపిఎం ఆందోళన
అనకాపల్లి జిల్లా రావికమ్మతం మండల కేంద్రంలో ఎమ్మార్వో. దళిత కాలనీ జడ్పీ హైస్కూల్ వద్ద చెత్తకి స్థలం కేటాయించి చెత్తను తొలగించాలని సిపిఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చెత్త వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ పంచాయతీ. స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ నెల్లో ప్రతి మూడో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శుభ్రత పాటించాలని. చెత్త సంపద కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. రావికమతం మండల కేంద్రంలో చెత్త వేయటం కోసం సర్వేనెంబర్ 67-1 ,-0-48 సెంట్లు ప్రభుత్వ భూమి గుర్తించి 0-20 సెంట్లు భూమిని చెత్తకి కేటాయించారు 2023 సంవత్సరంలో పంచాయతీకి అప్పగించారు. దీన్ని కొత్త మంది ప్రభుత్వ భూమి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లు జిరాయితి భూమి ఈ భూములో చెత్త వెయ్యకూడదని హైకోర్టులో పిటిషన్ వేశారు. నేడు ఈ భూమికి ఫెన్సింగ్ కూడా వేశారు. రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదు . దీనివల్ల మండల కేంద్రంలో 5000 జనాభా గల చెత్తంతా తీసుకొని వచ్చి అంబేద్కర్ కాలనీ. మీసేవ ఎమ్మార్వో కార్యాలయం జడ్పీ హైస్కూల్ దగ్గర ప్రదేశంలో చెత్తను పోగడంతో పిల్లలు భోజనం సమయంలో దుర్వాసనతో భరిస్తున్నారు. మరోవైపు దళితులు కూడా అనారోగ్యం గురవుతున్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించి చెత్తను తొలగించేటట్టు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ గారికి పిర్యాదు చేసిన నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు .దీనిపై భారీ ఎత్తున ఆందోళన చేయాలని చేపట్టాలని సిపిఎం భావించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి కె. గోవిందరావు గిరిజన సంఘం నాయకులు కిల్లో సూరిబాబు తదితరులు పాల్గొన్నారు