logo

పవన్ వ్యాఖ్యలను వక్రీకరణ… ఖండనలో జనసేన తెలంగాణ – ఆంధ్ర బంధం దెబ్బతీయద్దని రమాదేవి హెచ్చరిక

ఎన్టీఆర్ జిల్లా నందిగామ, డిసెంబరు 4: (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

రాజోలు సభలో జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కొంతమంది తెలంగాణ నాయకులు తప్పుగా అర్థం చేసుకొని, రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం తీవ్రంగా ఖండిస్తున్నట్టు నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త దుర్గా మల్లేశ్వర స్వామి వారి ట్రస్ట్ బోర్డ్ మెంబర్ తంబళ్ళపల్లి రమాదేవి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ మాటల ఉద్దేశాన్ని దుర్వినియోగం చేయడం సరైంది కాదని ఆమె అన్నారు. వరదలతో నష్టపోయిన రైతులను ఓదార్చే క్రమంలో, వారి బాధను తగ్గించేందుకు మాత్రమే పవన్ కళ్యాణ్ ‘దిష్టి’ అనే పదాన్ని ఉపయోగించారని, దాన్ని తెలంగాణ ప్రజలపై విమర్శగా చూపడం పూర్తిగా తప్పుడు అన్వయమని రమాదేవి పేర్కొన్నారు.“ఏ ప్రాంతాన్ని గాని, ఏ రాష్ట్రాన్ని గాని పవన్ కళ్యాణ్ విమర్శించలేదు. ఆయన వ్యాఖ్యలను మొత్తం తెలంగాణ ప్రజలపై విస్తరించడంబాధాకరం. ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల మధ్యున్న అన్నదమ్ముల బంధాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయకూడదు” అని తేల్చిచెప్పారు. రాజకీయ వేదికపై చెప్పిన మాటలను వ్యక్తిగతంగా తీసుకోవడం సమంజసం కాదని ఆమె అన్నారు. “రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలి, అభివృద్ధి పథంలో సహకారం అవసరం” అని రమాదేవి పేర్కొన్నారు.

47
213 views