logo

రైతన్న మీకోసం గ్రామ వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక



ఆరు రోజులు పాటు నిర్వహించిన రైతన్న మీకోసం సర్వేలో అంశాలను అనుసరించి రైతులు శాస్త్రవేత్తలు గ్రామైక్య సంఘాలు వ్యవసాయ అధికారులు అంతా కలిసి గ్రామ వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక తయారుచేసి తద్వారా రైతు అభివృద్ధికి పాటుపడాలని సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ అన్నారు. పాంచాలి గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం వర్క్ షాప్ లో మాట్లాడుతూ రైతులు ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచుకోవాలని యూరియా వినియోగాన్ని తగ్గించి నానో యూరియా వాడాలని పంటల మార్పిడి చిరుధాన్యాల సాగు పెంచాలని భూమి ఆరోగ్యం కోసం నవధాన్యాలు చల్లాలని నిరంతరం నేల పచ్చని పంటలతో కప్పి ఉండేటట్లుగా చూడాలని అప్పుడే నేలలో సారం నిలకడగా ఉంటుందని తెలిపారు ప్రతి రైతు కనీస అవసరాల కోసం అయినా ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలని కోరారు. డ్రోన్లను వినియోగించుకుని మందులు పిచికారి చేసుకోవడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు.అమ్మ వలస, కర్రీవలస గ్రామాలలో రైతన్న మీకోసం కార్యక్రమాలలో పాల్గొన్న ప్రకృతి సేద్య రీజనల్ కోఆర్డినేటర్ కే ప్రకాష్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా పలు పంటల విధానాన్ని పాటించాలని వరి పంట తర్వాత వేసే అపరాలలో కేవలం అపరాలు మాత్రమే కాకుండా కూరగాయలు ఆకుకూరలు వంటి 7 లేదా 8 రకాలు కలిపి చల్లుకుంటే ప్రధానపంట కోతకు వచ్చిన తర్వాత కూడా అదనపు ఆదాయం లభిస్తుందని వేసవిలో కూడా ఎన్ని ఎక్కువ రకాలు వీలైతే అన్ని ఎక్కువ రకాల విత్తనాలను చల్లుకుని నేల అంతా పూర్తిగా వేడి ఎండకు గురికాకుండా ఏదో ఒక పంటతో 365 రోజులు కప్పి ఉండేటట్లుగా చూసుకోవాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య రీజనల్ ట్రైనింగ్ అధికారి హేమ సుందర్, జిల్లా ప్రాజెక్ట్ అధికారి శ్రావణ్ కుమార్ నాయుడు, వ్యవసాయ అధికారి కే .తిరుపతిరావు గ్రామ వ్యవసాయ సహాయకులు, సిఆర్పిలు పాల్గొన్నారు.

68
2348 views