
విద్యారంగ సమస్యలపై ఎస్.ఎఫ్.ఐ. 'తిరుపతి' రాష్ట్ర మహాసభ: పోరాటానికి కార్యాచరణ! ప్రచురణార్థం
ప్రచారార్థం
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యం స్థానిక ఎల్.బి.జి. భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహ. వెంకటేష్ మాట్లాడుతూ ఈ నెల 12,13,14 తిరుపతి లో జరిగే రాష్ట్ర మహాసభను జయప్రదం చెయ్యాలని కోరుతూ విద్యారంగ సమస్యలపై ఇప్పటివరకూ జరిగిన పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నేటికీ సొంత భవనం లేకపోవడం. సంక్షేమ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెరగకపోవడం వలన విద్యార్థుల అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా విజయనగరం కేంద్రం లో ఉన్నట్టువంటి, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ సొంత భవనాలు పూర్తి కాలేదు. యువగలం లో నారా లోకేష్ గారు ఇచ్చి నటువంటి హామీ జీవో నెంబర్ 77 రద్దు అమలు కాలేదు. పైగా ఇంజనీరింగ్, డిగ్రీ చదువు తున్నటువంటి విద్యార్థులకు వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ లు బకాయి ఉంచడం వలన విద్యార్థులు చదువులపై భారం పడుతోంది వీటితోపాటు మరిన్ని విద్య రంగ సమస్యలపై ఎస్.ఎఫ్.ఐ. పోరాడేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకోవడం కోసం విద్యార్థులందరికీ మేధావులకి ప్రజానీకానికి కోరత ఉన్నాము ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము జిల్లా అధ్యక్షుడు ఈ చిన్నబాబు జిల్లా కన్వీనర్ శిరీష పాల్గొన్నారు