logo

తొక్కిసలాటకు ఏడాది.. దయనీయస్థితిలో శ్రీతేజ్

గతేడాది Dec 4 రాత్రి 'పుష్ప-2' ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి ఏడాదైనా దయనీయంగానే ఉంది. తానంతట తాను అన్నం తినలేని స్థితిలో ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉంటున్నాడు. ఎవరినీ గుర్తుపట్టలేక పోతున్నాడు. అతడికి చికిత్స ఇప్పించేందుకు నెలకు రూ.1.50 లక్షలు ఖర్చవుతున్నాయని, అల్లు అర్జున్ మేనేజర్ను సంప్రదిస్తే సానుకూల స్పందన లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు.

3
441 views