logo

డ్రగ్స్ మత్తు పదార్థాలు గంజాయి విక్రయాలపై పోలీసులు నిఘా పెట్టాలి.

నంద్యాల (AIMA MEDIA): ప్రతిరోజు గంజాయి రవాణా జరుగుతుంది. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట గంజాయిని పట్టుకున్నాం అనే వార్తలు రోజు చూస్తూనే చదువుతూనే ఉన్నాం. ఎప్పుడూ లేనివిధంగా విశ్వవిద్యాలయాలు, మొదలుకొని పాఠశాలల వరకు మారుమూల గ్రామాలు మొదలుకొని రాష్ట్ర రాజధాని ప్రాంతాలైన విజయవాడ గుంటూరులలో సైతం గంజాయి బహిరంగంగా విచ్చలవిడిగా దొరుకుతున్నది అనేది బహిరంగ రహస్యం. గంజాయిని సేవిస్తున్న వారు,దాన్ని విక్రయిస్తున్న వారు, గంజాయి విక్రయదారులకు భుజం కాస్తున్న రాజకీయ పార్టీల నేతలు సాగిస్తున్న హత్యలు సమాజాన్ని కలవర పరుస్తున్నాయి.యువతను నిర్వీర్యం చేస్తున్న మద్యం, డ్రగ్స్ మత్తు పదార్థాలు గంజాయి తదితర వాటిపై ఏఐవైఎఫ్ ఎన్నో పోరాటాలను, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ గంజాయి విక్రయాలపై పోలీసులు నిఘా పెట్టాలని, గంజాయి రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఉపన్యాసాలిచ్చిన ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు నేడు రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నా ఏమైపోయారని ఆయన నిలదీశారు. రాష్ట్ర రాజధాని ప్రాంతాలైన విజయవాడ, గుంటూరులలో గంజాయి బహిరంగంగా విచ్చలవిడిగా దొరుకుతుందని, నెల్లూరులో పెంచలయ్య అనే యువకుడ్ని పట్టపగలే స్కూటర్తో ఢీకొట్టి, కత్తులతో పొడిచి చంపిన ఘటన చూస్తే గంజాయి మాఫియా ఎంత బరి తెగించిందో అర్థమవుతుందని అన్నారు. హైస్కూల్ స్థాయి పిల్లల నుండి ఇంజనీరింగ్, పీజీ యూనివర్సిటీ స్థాయి యువత వరకు గంజాయి చేరుతుందంటే ఈ మాఫియాకున్న నెట్వర్కు ఎంతవరకు విస్తరించిందో అర్థం చేసుకోవచ్చని, ఈగల్ లాంటి ప్రత్యేక బలగాలు గంజాయిని నియంత్రించాలని పేర్కొన్నారు.

13
574 views