logo

గ్యాస్ ఏజెన్సీ యజమానులతో జెసి సమావేశం.

నంద్యాల (AIMA MEDIA): జిల్లాలో గ్యాస్ డెలివరీ బాయ్స్ గ్యాస్ బిల్లులో ఉన్న డబ్బు కంటే ఒక పైసా కూడా ఎక్కువ తీసుకోరాదని జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీ యజమానులతో జెసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో వివిధ గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించి గ్యాస్ డెలివరీ బాయిలు సిలిండర్ లు డోర్ డెలివరీ చేసినప్పుడు వినియోగదారుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడం జరిగిందన్నారు. డెలివరీ బాయ్ లు గ్యాస్ బిల్లు కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదన్నారు.గ్యాస్ ఏజెన్సీలు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేటట్లు చూడాలన్నారు. నిబంధనలు అతిక్రమించినట్లయితే గ్యాస్ ఏజెన్సీని సీజ్ చేసి తొలగించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల యజమానులు, సివిల్ సప్లై అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

0
453 views