logo

రైతుల క్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం: కలెక్టర్ రాజకుమారి గనియా.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం వర్క్ షాప్ లో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ పాల్గొని రైతులతో గ్రామంలో ప్రస్తుతం సాగు చేస్తున్న వ్యవసాయ పంటల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించిన ఐదు సూత్రాలను పాటించాలని రైతులకు తెలిజేసారు. అలాగే రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలని అందుకుగాను ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరించాలని అలాగే పంటలలో పిచికారి చేయుటకు డ్రోన్స్ వినియోగించాలని, రసాయనీక ఎరువుల వాడకం తగ్గించి నానో ఎరువుల వాడకం అలవర్చుకోవాలని సూచించారు. ఈ వర్క్ షాప్ ద్వారా రైతులతో చర్చించిన అంశాలను క్రోడీకరించి గ్రామ సమగ్ర అభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.

3
3 views