
శ్రీశైల మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం డిసెంబర్ 8వ తేదీ వరకు నిలుపుదల.
రద్దీకారణంగా డిసెంబరు 8 వరకు స్పర్శ దర్శనం నిలుపుదల.
భక్తుల రద్దీ కారణంగా డిసెంబరు 8వ తేదీ వరకు శ్రీస్వామివారి
స్పర్శదర్శనాన్ని పూర్తిగా నిలుపుదల చేశామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మరియు
కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేశారు.కాగా జ్యోతిర్ముడి ధరించిన శివదీక్షా భక్తులకు మాత్రం ఈ నెల 5వ తేదీ వరకు విడతల వారిగా అనగా ప్రతి రెండుగంటలకు ఒకసారి స్పర్శదర్శనానికి అనుమతించడం జరుగుతోందన్నారు.ఇంకా వారు మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన కార్తీకమాస శివదీక్షా విరమణ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఈ నెల 5వ తేదీ వరకు శివదీక్షా విరమణకార్యక్రమంకొనసాగించబడుతుందన్నారు.అందుకే జ్యోతిర్ముడి ధరించిన శివదీక్షా భక్తులకు మాత్రమే స్పర్శదర్శనం కల్పిస్తున్నామన్నారు.
ఈ నెల 6,7, 8 తేదీలలో కూడా భక్తులరద్దీ కొనసాగే అవకాశం ఉందన్నారు. అందుకే 8వ తేదీ వరకు కూడా స్పర్శదర్శనం ఆన్‌లైన్ టిక్కెట్ల జారీని కూడా నిలుపుదల చేయడం జరిగిందన్నారు.ఈ మూడురోజులు భక్తులందరికీ కూడా కేవలం శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించడం
జరుగుతోందన్నారు.డిసెంబరు 8వ తేదీ వరకు సిఫారసు లేఖల ద్వారా వచ్చేవారికి కూడా స్పర్శదర్శనానికి అవకాశంఉండదన్నారు.సర్వదర్శనం క్యూలైన్లలోని సాధారణ భక్తులకు ఎక్కువ సమయం వేచివుండకుండా ఉండేందుకుగాను ఈ నిర్ణయం తీసుకోవడంజరిగిందన్నారు.అలంకార దర్శనం ఏర్పాటు వలన
భక్తులందరు కూడా సులభతరంగా శ్రీస్వామివారిని దర్శించుకోవడానికి వీలు కలుగుతుందన్నారు.అయితే డిసెంబరు 5 తేదీ వరకు మాత్రం శ్రీస్వామివారి గర్భాలయ అభిషేకాలు మరియు సామూహిక అభిషేకాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.
భక్తులు ఈ మార్పును గమనించాలని ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారి తెలియజేశారు.
శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ