భర్త లేని లోకంలో ఉండలేను
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
రెండేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న వివాహిత
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో భార్య అఖిల(25), కొడుకు శ్రియాన్ గౌడ్(2) తో కలిసి నివసిస్తూ, కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన ప్రవీణ్ గౌడ్ అనే వ్యక్తి
ఏడాది క్రితం అనారోగ్య సమస్యతో ప్రవీణ్ మృతిచెందగా, తీవ్ర మనస్తాపానికి గురైన అఖిల
అత్తమామలు మరో వివాహం చేసుకోమని చెప్పినా వినకుండా, తరచూ ప్రవీణ్ జ్ఞాపకాలతో బాధపడుతూ ఉండేదని తెలిపిన స్థానికులు
ఈ నేపధ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కొడుకుకి ఉరి వేసి, తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న అఖిల