
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను కడతేర్చిన కసాయి తమ్ముడు
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
అప్పులు తీర్చడానికి మానసిక పరిపక్వత లేని అన్నపై రూ.4 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ చేయించి, టిప్పర్ లారీతో తొక్కించి హత్య చేసిన తమ్ముడు
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో మూడేళ్ల కిందట రెండు టిప్పర్లను కొనుగోలు చేసి, వాటిని అద్దెకు ఇస్తూ జీవనం కొనసాగిస్తున్న మామిడి నరేష్(30) అనే వ్యక్తి
ఇటీవల వ్యాపారం సరిగ్గా నడవక తీవ్ర అప్పుల పాలవడంతో, తనతో పాటు ఇంట్లో ఉంటున్న మానసిక పరిపక్వత లేని అన్న వెంకటేష్(37) పేరిట ఇన్సూరెన్స్ పాలసీ చేయించి అతన్ని హత్య చేసి, వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్న నరేష్
ఈ పథకంలో భాగంగా రెండు నెలల నుండి అన్న పేరు మీద వేర్వేరు సంస్థల నుండి దాదాపు రూ.4.14 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలు చేయించిన తమ్ముడు
ఇదే సమయంలో తనకు ఇవ్వాల్సిన రూ.7 లక్షలు ఇవ్వాలని నరేష్‌పై ఒత్తిడి తెస్తున్న రాకేష్(28) అనే వ్యక్తికి, తన కుట్రకు సహకరిస్తే అదనంగా రూ.13 లక్షలు ఇస్తానని చెప్పి ఒప్పించిన నరేష్
తన పథకంలో భాగంగా రూ.2 లక్షలు ఇస్తానని ప్రదీప్ అనే టిప్పర్ డ్రైవర్‌ను ఒప్పించడంతో, గ్రామ శివారులో టిప్పర్ ఆగిపోయిందని వెంకటేష్‌కు ఫోన్ చేసి పిలిచిన డ్రైవర్
డ్రైవర్ పిలుపు మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన వెంకటేష్‌ను టిప్పర్ కింద జాకీ పెట్టాలని, కింద పడుకోబెట్టి, టిప్పర్ ముందుకు నడిపిన నరేష్
తలపై నుండి టిప్పర్ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందిన వెంకటేష్
ప్రమాదవశాత్తు మరణించాడని నరేష్ తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు
ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించేందుకు వచ్చి, నరేష్ ఇచ్చే సమాధానాలపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు
ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి, వెంకటేష్‌ను తన తమ్ముడు నరేష్ హత్య చేసినట్లు నిర్ధారించి, నరేష్, రాకేష్, ప్రదీప్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు