logo

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ వీఆర్వో

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ విఆర్ఓ అశోక్ కుమార్.

*పత్తికొండ*

దేవనకొండ మండలం నల్ల చెలిమల వీఆర్వో అశోక్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.చందోలి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ శివకుమార్ తన తల్లి పేరు మీద ఉన్న వారసత్వ భూమిని తన పేరు మీద చేసుకునేందుకు వీఆర్వో అశోక్ కుమార్ ను ఆశ్రయించగా 40 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా,తాను అంత ఇవ్వలేను తగ్గించుకొని చెప్పండి అని బ్రతిమలాడినా వీఆర్వో అశోక్ 40 వేలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పడంతో బాధితుడు శివకుమార్ ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు.కర్నూలు ఏసీబీ డి.ఎస్.పి సోమన్న నేతృత్వంలో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం కాపు కాచి,సోమవారం నాలుగు స్తంభాల మండపం దగ్గర ఉన్న మౌరిన్ నెట్ సెంటర్ షాపులో 40 వేలు లంచం తీసుకుంటుండగా విఆర్ఓ అశోక్ కుమార్,మధ్యవర్తి జయరాముడును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతామని ఏసీబీ డీఎస్పీ సోమన్న విలేకరులకు తెలిపారు.
మన డోన్ పట్టణం.

0
77 views