logo

రాయలసీమ యూనివర్సిటీ కి అనుబంధంగా ఉండి అక్రమాలకు పాల్పడుతున్న బిఈడి కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి... RSA,DSYA

నంద్యాల, నవంబర్ 2, AIMA మీడియా ప్రతినిధి ఆర్ఎన్ రెడ్డి:
స్థానిక కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీ నందు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న బీఈడీ కళాశాలల రద్దు చేయాలని కోరుతూ రాయలసీమ యూనివర్సిటీ రిజిస్టర్ విజయ్ కుమార్ నాయుడు గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా *రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బందెల ఓబులేసు డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ రియాజ్* మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బీడీ కళాశాలలు కేవలం జిరాక్స్ పేపర్లు చూసి అనుమతులు అడగడం దీనికి యూనివర్సిటీ అధికారులు సైతం తూతూ మంత్రంగా వెరిఫికేషన్ చేసి నట్లు చేసి అనుమతులు ఇవ్వడం సరైనది కాదని అలాగే ఉమ్మడి జిల్లాలోని కొన్ని కళాశాలలకు బిల్డింగులు లేకుండా కేవలం అప్లేషన్ కు మాత్రమే బిల్డింగులు చూపి ఆ తర్వాత ఏదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో ఆఫీసు తీసుకుని అక్కడ అడ్మిషన్ ప్రక్రియ మొదలు పెట్టడం ఆ సంవత్సరం మొత్తం పూర్తి చేస్తున్నారని అదేవిధంగా కొన్ని కళాశాలలకు అర్హత గల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది లేదని విద్యార్థులకు తరగతులు కూడా నిర్వహించడం లేదని సరైన సిబ్బంది లేక కొంతమందితో సర్టిఫికెట్లు వారికి అడపాదడపా నామమాత్రంగా కొంత డబ్బు చెల్లించి వారి సర్టిఫికెట్లు వాడుకొని అనుమతులు పొంది లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు అదేవిధంగా బీఈడీ కళాశాలలకు సంబంధించి ఏదైతే ఎన్సీఈఆర్టీ నిబంధనలు ఉన్నాయో ఉన్నాయో ఆ నిబంధనలు ఏ ఒక్క కళాశాల కూడా పాటించడం లేదని అలాంటి కళాశాల పైన ఉన్న భూములను సైతం అమ్ముకొని పేపర్లు మాత్రమే చూపుతున్నారని ఏ ఒక్క కళాశాల కూడా ఎఫ్ డి ఆర్ లు కూడా ఉండవని అదేవిధంగా బ్లాక్ టీచింగ్ సంబంధించి సంబంధిత పాఠశాలల హెచ్ఎం లతో కొంత డబ్బు ఎర్ర చూపి బ్లాక్ టీచింగ్ చేయకపోయినా చేసినట్లు చూపి ప్రాక్టికల్స్ జరపకపోయినా జరిపినట్లు చూపి ఆ ఆ ప్రధానొపాధ్యాయులకు ఏదైనా సమస్య అవుతుందని తెలిపారు యూనివర్సిటీ అధికారుల అండదండలు మాకు ఉన్నాయని మీకు ఏమీ కాకుండా మేము చూసుకుంటామని పాఠశాలల ఉపాధ్యాయులను సైతం ప్రలోభ పెడుతున్నారని దీనిపై సమగ్ర విచారణ జరిపి ఎవరైతే దీనిలో యూనివర్సిటీ అధికారుల హస్తముందో వారిపై చర్యలు తీసుకుని అదే విధంగా నిబంధనలను పాటించని కళాశాలలకు ఆ అనుమతులు ఇవ్వద్దని రాయలసీమ యూనివర్సిటీ రిజిస్టర్ విజయ్ కుమార్ నాయుడు గారిని కోరడం జరిగిందని వీడికి ఆయన స్పందిస్తూ అలాంటి ఏ కళాశాలలో ఉన్న తీసుకురావాలని వారు తెలిపారని ఇటువంటి కళాశాలలపై చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున విద్యార్థులతో కలిసి రాయలసీమ యూనివర్సిటీ ని ముట్టడిస్తామని వారు తెలిపారు

14
410 views