logo

అఖిలభారత సిఐటియు 18వ మహాసభలు జయప్రదం చేయండి

సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు జయప్రదం చేయండి..కామనురు శ్రీనివాసులు రెడ్డి

సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సి ఐ టి యు 18వ అఖిల భారత మహాసభలు 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖలో జరుగుతున్నాయి. సిఐటియు ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్లో జరగడం మన రాష్ట్రానికే గర్వ కారణం. ఈరోజు సిఐటియు కమలాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో రాజేష్ అధ్యక్షతన కమలాపురం క్రాస్ రోడ్స్ వద్ద జాతీయ మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనివాసులు రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నార అనంతరం మాట్లాడుతూస్వాతంత్రోద్యమ వారసత్వంలో పుట్టి కార్మికవర్గ ఆశయానికి అంకితమైన సంస్థ సిఐటియు, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రధాన కేంద్రమైన విశాఖపట్టణం ఈ మహాసభలకు వేదిక కానుంది.
'ఐక్యత-పోరాటం' అనే నినాదంతో దేశంలోని అన్ని సమరశీల పోరాటాల్లో సిఐటియు అగ్రభాగాన నిలిచింది. 1974 చారిత్రాత్మక రైల్వే పోరాటం నుంచి నేటికీ కొనసాగుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, వ్యతిరేక పోరాటం వరకూ అన్ని సమరశీల పోరాటాల్లో సిఐటియు అగ్రభాగంలో ఉంది. నిరంకుశ పాలనకు నిదర్శనమైన 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని దేశంలోనే ఎదిరించిన ఏకైక ట్రేడ్ యూనియన్ సిఐటియు. కార్మిక హక్కులన్నీ కాలరాచినా ఇతర సంఘాలన్నీ ఎమర్జెన్సీకి భజన చేశాయి. ఎమర్జెన్సీని మించి మోడీ ప్రభుత్వం నేడు కార్మిక వర్గంపై దాడి సాగిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా సిఐటియు రాజీ లేకుండా పోరాడుతున్నది.
1991 నుంచి కేంద్రంలోని ప్రభుత్వాలు సరళీకరణ విధానాలు అమలు చేస్తున్నాయి. పెట్టుబడిదారులకు పెద్దపీట వేశాయి. దేశంలోని భారీ పరిశ్రమలు, భూములు, గనులు, సముద్ర తీరం మొదలైనవన్నీ కారుచౌకగా పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నాయి. నేడు కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. ఈ సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు పోరాడుతున్నది. ఈ కార్యక్రమంలో సాదక్ చరణ్ ముక్తియార్ పండు, వినయ్, దాదాపీర్ అమీర్ ,చౌడయ్య రఫీ, రామాంజనేయులు ప్రసాదు ,సుబ్బరాయుడు సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు

2
2414 views