logo

తిరుపతి జిల్లాలో నగరిని విలినం చేయాలని విజ్ఞప్తి..

తిరుపతి జిల్లాలో నగరి నియోజకవర్గం విలీన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా... రెవెన్యూ మంత్రి అనగాని నగిరి నియోజకవర్గ పరిధిలోని విజయపురం, నిండ్ర, నగరి మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేసే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చినట్టు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయ్ బాబు తెలిపారు. ఈ మూడు మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేసే విషయమై మంగళవారం ఆయన మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల జిల్లాల విభజన జరిగినప్పుడు నగరి నియోజకవర్గంలోని మొత్తం ఐదు మండలాల్లో విజయపురం, నిండ్ర, నగరి మండలాలను చిత్తూరు జిల్లాలోనూ... పుత్తూరు, వడమాల పేట మండలాలను తిరుపతి జిల్లాలో కలపడం జరిగిందన్నారు. రెండు మండలాలు ఒక జిల్లాలో మరో మూడు మండలాలు మరొక జిల్లాలో ఉండడం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా విజయపురం, నిండ్ర మండలాల ప్రజలు చిత్తూరు జిల్లా కలెక్టర్ అఫీస్ కు తమ పనుల నిమిత్తం వెళ్లాలంటే సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ వ్యయ, ప్రయాసలకు లోనుకావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలిపితే ఆయా మండలాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ మూడు మండలాల ప్రజలు తమను తిరుపతిలోనే కలపాలని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆభీష్టానికి అనుగుణంగా తానునగరి నియోజకవర్గం మొత్తం తిరుపతి జిల్లాలో వుండేలా చేయగలరని కోరుతూ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశానని తెలిపారు.

7
318 views