
సంతోష జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసిన ప్రమాదం.
రాజమహేంద్రవరం : విధి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. అప్పటిదాకా సంతోషం ఒక్కసారిగా ప్రమాదం గా మారి, బాధపడుతున్న ఒక సామాన్యురాలి కధ.....
రాజమహేంద్రవరం శివారు... రాజానగరానికి చెందిన ఒక సాధారణ గృహిణి రాజకుమారి (సత్య ). భర్త ఒక ట్రాక్టర్ డ్రైవర్. వారికీ ముగ్గురు చిన్న పిల్లలు. చిన్నప్పటినుంచి నటన మీద ఆసక్తి గల రాజకుమారి కి ఇంస్టాగ్రామ్ లో అస్లీలత లేని చక్కని హావభావాలతో వీడియోస్ చేస్తూ, అందరి మన్ననలు పొంది, సంతోషం గా ఉన్నదాంట్లో జీవిస్తున్న మన చిట్టీ తల్లి రాజకుమారి సరదాగా ఆలా స్కూటీ మీద వెళ్తూ అనుకోని ప్రమాదానికి గురి అయి, మొహం మీద తీవ్ర గాయం అయి పడిఉంటే, స్థానికులు హుటాహుటిన రాజమహేంద్రవరం ఆసుపత్రి కి తరలించారు. దవడ ఎముకలు విరిగి, కంటికింద ఎముక విరిగి ఆచేతనం గా పడి ఉన్న ఆ అభాగ్యురాలిని చూసి డాక్టర్స్ కూడా చలించిపోయారు. దాదాపు గా 3 లక్షలు ఆపరేషన్ కి ఖర్చు అయి నెలకి 5000 మందులకి అవుతుంది. వచ్చే ఆదాయం లో సింహ భాగం మందులకే అవుతున్నాయని, ఇంస్టాగ్రామ్ లో కళ్ళనీళ్ల పర్యంతం అయిన రాజకుమారిని చూసి, ప్రముఖ aima మీడియా జర్నలిస్ట్, అనేక మంది గాయని గాయకులని ప్రోత్సాహస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న "స్వరబృందావనం" సంస్థ అధినేత, ప్రముఖ గాయకులు మరియు anchor అయిన శ్రీ బృందావనం రవికాంత్ స్పందించి వెంటనే 2000 రూపాయలు ఆర్ధిక సహాయం చేసారు. ఈ విషయం మీద రవికాంత్ గారు మీడియా తో మాట్లాడుతూ, ద్విచక్రవాహనాలు నడిపేవారు తక్కువ దూరం ఎక్కువ దూరం అని కాకుండా ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలని, ఆలా హెల్మెట్ తన ప్రాణం కూడా ఒకసారి కాపాడింది అని గుర్తు చేసారు.
రాజకుమారికి ఆర్ధికంగా అందరు సహకరించాలని... తన ఫోన్ pay నెంబర్ +91 96033 84562 కి హెల్ప్ చేయాలనీ విజ్ఞప్తి చేసారు.