టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: జీసిసి చైర్మన్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ కి అత్యంత ప్రాధాన్యమైనవి, ప్రతి గ్రామం, బూత్ లలో టీడీపీ పటిష్టంగా నిలవాలని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. అనంతగిరి లో సోమవారం నిర్వహించిన టీడీపీ మండల నాయకుల సమావేశంలో కిడారి మాట్లాడారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే నాయకత్వమే పార్టీని గెలిపిస్తుందన్నారు. బూత్ కమిటీలు, యువజన,మహిళా శక్తిని సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.