logo

ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి భరోసా..మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి ఔదార్యం...



అతని కాలు ఆపరేషన్ కి సహకరించిన వాసుపల్లి

వాసుపల్లి సహకారానికి అతని కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు


రాజకీయ,కులమతాలకు అధికంగా వైసిపి నాయకులు,దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేస్తున్న సేవల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు సేవ చేయాలంటే పదవే అక్కర్లేదని, నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని తన పరిధి మేరకు సహాయం చేయడం మాత్రమే తనకు తెలుసని సగర్వంగా చెప్పే గొప్ప నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్.32వార్డు అధ్యక్షుడు రాజారెడ్డి ద్వారా విషయం తెలుసుకొని ఆ వార్డుకు చెందిన జీవన్ అనే వ్యక్తి ప్రమాదానికి గురై కాలు ప్యాక్చర్ కాగా అతనిని కుటుంబ సభ్యులు స్థానిక కేజీహెచ్ ఆసుపత్రికి చేర్పించడం జరిగింది.కానీ ఆరోగ్యశ్రీ లేకపోవడంతో శస్త్ర చికిత్స నిలిచిపోయింది. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో విషయం తెలుసుకున్న వాసుపల్లి గణేష్ కుమార్ వెంటనే స్పందించి ఒక్క రోజులో అతనికి ఆపరేషన్ పూర్తి అయ్యేలా తన పూర్తి సహకారం అందించారు.తక్షణమే అధికారులతో మాట్లాడి కేజీ హెచ్ లోనే ఉచితంగా ఆపరేషన్ చేయించారు.
తన నియోజకవర్గంలో ప్రజలకు ఈ సమస్య వచ్చినా తాను ఎప్పుడూ ముందుంటారు.ప్రజా సమస్యలను తన సమస్యగా భావిస్తారు.24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ తన పరిధి మేరకు వారికి సహాయం చేస్తూ ఉండటం జరుగుతుంది.
సమయానికి స్పందించి కాల ఆపరేషన్ ఒక్కరోజులో పూర్తయ్యేలా సహకరించిన వాసుపల్లి గణేష్ కుమార్ కి అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

1
121 views