logo

రబీ సీజన్లో వరి తో పాటు అన్ని పంటలు సాగు చేయుటకు సాగునీరు ఇచ్చేలా ఐడిబి సమావేశంలో తీర్మానం చేయాలి.

ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిసెంబర్ 2 మంగళవారం జరుగు ఐడిబి సమావేశంలో పాల్గొనే జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు అంతా కలసి నంద్యాల జిల్లాలోని అన్ని సాగు నీటి ప్రాజెక్టుల కింద రబీసీజన్లో వరి పంట వేసుకునుటకు అవసరమైన సాగునీరు ఇచ్చే విధంగా సమావేశంలో తీర్మానం చేసి జిల్లా రైతాంగానికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ .రాజశేఖర్ , టి.రామచంద్రుడు జిల్లా సహాయ కార్యదర్శి కే. సురేష్, శ్రీనివాస రెడ్డి ప్రభుత్వాన్ని ప్రకటన ద్వారా ఆళ్లగడ్డలో కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాలు తుఫాను వల్ల నంద్యాల జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వరి, మొక్కజొన్న, మినుము, ఉల్లి, అరటి , బొప్పాయి లాంటి పంటలు పూర్తిగా దెబ్బతిని దిగుబడి బాగా పడిపోయింది. అందువల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఖరీఫ్ లో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే డిసెంబర్ రెండో తేదీన జరగబోవు ఐడిబి సమావేశంలో రెండో పంట వరితో పాటు అన్ని పంటలు సాగు చేసుకొనుటకు అవసరమైన సాగునీరు జిల్లాలోని తెలుగు గంగ, కేసీ కెనాల్, ఎస్ ఆర్ బి సి, మైనర్ ఇరిగేషన్ చెరువులు, సిద్దాపురం చెరువు నింపడం వల్ల జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పంటలు పండించుకోవడానికి అనువుగా సాగునీటి విడుదల చేసే విధంగా తీర్మానం చేయాలని అధికార యంత్రంగానికి విజ్ఞప్తి చేశారు.

13
920 views