logo

జిమ్నాస్టిక్స్ జాతీయ పోటీలకు మన్యం పల్లవి ఎంపిక – గ్రామంలో హర్షం


ఆంధ్రప్రదేశ్‌ AIMA MEDIA ప్రతినిధి : జిమ్నాస్టిక్స్‌ జాతీయ స్థాయి పోటీలకు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్బీ పట్నం గ్రామానికి చెందిన మన్యం పల్లవి ఎంపికైందని కోచ్‌ ఎన్. సురేష్ తెలిపారు.

కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరిగిన 69వ అంతర్ జిల్లాల ఎస్జీఎఫ్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పల్లవి అండర్-14 విభాగంలో ఫ్లోర్ ఈవెంట్‌లో ద్వితీయ స్థానం సాధించి తన ప్రతిభను చాటింది.

ఈ విజయంతో పల్లవి జనవరి నెలలో కోల్‌కతాలో జరగనున్న జాతీయ సాయి పోటీలలో రాష్ట్రం తరపున పోటీపడనుంది.

చిన్న వయసులోనే ఆమె చూపుతున్న క్రమశిక్షణ, కఠోర శిక్షణకు ఫలితంగా వచ్చిన ఈ విజయం కోచ్‌లు, తల్లిదండ్రులు, క్రీడా ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

పల్లవి ఎంపిక వార్త తెలిసిన వెంటనే ఆర్బీ పట్నం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తల్లితండ్రులు, స్నేహాతులు, గ్రామస్తులు పల్లవికి అభినందనలు తెలిపారు.

12
677 views