logo

గుడివాడ తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో జరిగిన మోటార్ సైకిల్ దొంగతనం

జర్నలిస్టు : మాకోటి మహేష్
మీడియా నోట్

గుడివాడ తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో జరిగిన మోటార్ సైకిల్ దొంగతనం కేసులో Cr.No.203/2025 U/s 303(2) BNS (379 IPC) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటన 24.11.2025 రాత్రి 11.00 గంటల నుంచి 25.11.2025 ఉదయం 5.00 గంటల మధ్య జరిగింది. ఫిర్యాదుదారు మెకల రాంబాబు (58 సంవత్సరాలు) తన ఇంటి ముందు పార్క్ చేసిన బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్ (AP16 FF 7568) కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్ విలువ సుమారు ₹15,000గా పేర్కొన్నారు.

దర్యాప్తు సమయంలో విచారణలో భాగంగా, వయసు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్న ఒక అనుమానితుడు సదరు మోటార్‌సైకిల్‌ను దొంగతనం చేసినట్లు ప్రాథమికంగా తెలిసివచ్చింది.

ఈ వ్యక్తిని ఎవరు గుర్తిస్తే గానీ, సమాచారం గుడివాడ తాలూకా పోలీసులకు వెంటనే తెలియజేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము.

గుడివాడ తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

0
0 views