logo

నమ్మకంగా ఇంట్లో పని చేస్తూ దొంగతనానికి పాల్పడ్డ మహిళా మణి సహకరించిన పలువురు కటకటాల్లోకి * సిఐ వెంకటేశ్వర్లు , ఎస్సై రమాదేవి, పోలీస్ సిబ్బంది అభినందిం

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా**
సుజాతనగర్ మండలం**నవంబర్ 30**
(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి )

యజమాని ఇంట్లో దొంగతనం చేసిన మహిళ మరియు ఇతర ముద్దాయిల అరెస్ట్ మరియు దొంగ సొత్తు స్వాధీనం,


*గోల్డ్ మరియు వెండి రికవరీ చేసిన Total విలువ W/Rs 4,61,612/-,(నాలుగు లక్షల అరవై ఒక వేల ఆరువందల పన్నెండు రూపాయలు),


వేపలగడ్డ గ్రామంలోని లింగం మాలకొండ రెడ్డి ఇంట్లో పనిచేసే సుజాతనగర్ గ్రామానికి చెందిన కావేటి కృష్ణవేణి అను మహిళ గత మూడు సంవత్సరాల నుండి ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ ఉంది ఇంటి యజమానికి తెలియకుండా ఆ ఇంట్లో కబోర్డ్ లోదాచిన సుమారు 7139 గ్రాముల వెండి వస్తువులను మరియు 11.9 గ్రాములు గల బంగారపు వస్తువులను దొంగలించి అట్టి వస్తువులను కృష్ణవేణి మరియు ఆమె భర్త అయిన కావేటి రాంబాబు కలిసి కొత్తగూడెం చిన్న బజారులోని బంగారం షాప్ ముందు గోల్డ్ మరియు సిల్వర్ రిపేర్ వర్క్ చేసే గాలిపెళ్లి మాధవాచారి మరియు ఉప్పుల శోభన్ చారి అను ఇద్దరు వ్యక్తుల ద్వారా చిన్న బజార్లోని విజయదుర్గ జువెలరీ షాపు, మారుతి కోల్డ్ వర్క్ షాప్, రశ్మిత గోల్డ్ వర్క్ షాప్, శ్రీ రాజరాజేశ్వరి గోల్డ్ వర్క్ షాప్ లలో అమ్మినారు. ఫిర్యాది లింగమాల కొండారెడ్డి గారు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దొంగతనం చేసిన కృష్ణవేణిను, అందుకు సహకరించిన ఆమె భర్త రాంబాబును, అదే విధంగా అట్టి దొంగ వస్తువులను అమ్మిన మాధవాచారి మరియు శోభన్ చారీను, గోల్డ్ షాప్ యజమానులను ఈరోజు చుంచుపల్లి సిఐ గారు అరెస్టు చేసి వారి వద్ద నుండి కేసు యొక్క బంగారం మరియు వెండి సామాన్లను స్వాధీనపరచుకోవడం జరిగింది.
నిందితుల వివరాలు:
1) కావేటి కృష్ణ వేణి W/o రాంబాబు, R/o సుజాతనగర్, (దొంగతనం చేసిన వ్యక్తి)
2) కావేటి రాంబాబు S/o కృష్ణ(late), R/o సుజాతనగర్(దొంగతనం చేసిన వ్యక్తి యొక్క భర్త )
3) గాలిపెల్లి మాధవాచారి S/O హనుమాన్లు, R/o కూలీ లైన్, కొత్తగూడెం(దొంగ వస్తువులను అమ్మిన మద్యవర్తి)
4) ఉప్పల శోభన్ S/o విశ్వనాథం (late), బంగారు repair దుకాణం R/O శ్రీనగర్ కాలనీ కొత్తగూడెం, (దొంగ వస్తువులను అమ్మిన మద్యవర్తి)
5) కోటేపల్లి గురునాథ్ S/o సత్యనారాయణ, R/o గణేష్ బస్తీ,( మారుతీ గోల్డ్ వర్క్ షాప్)
6) బసవపాత్రుని అమర్‌నాథ్ S/o లక్ష్మా చారి, R/O కూలీ లైన్, కొత్తగూడెం (చిన్న బజార్ విజయదుర్గా నగల దుకాణం)
7) పొడిశెట్టి రాజేంద్రప్రసాద్ S/O వెంకటయ్య,( రష్మిత గోల్డ్ వర్క్ షాప్, చిన్న బజార్)
8) రౌతు సన్యాసి రావు S/o రమణ, , (శ్రీ రాజ రాజేశ్వరి గోల్డ్ వర్క్ షాప్, చిన్న బజార్)

గోల్డ్ మరియు వెండి రికవరీ చేసిన Total విలువ W/Rs 4,61,612/-

ఈ కేసును చేదించి నిందితుల వద్ద నుండి బంగారం మరియు వెండి సొమ్మును రికవరీ చేసిన చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు , సుజాతనగర్ ఎస్సై రమాదేవి , మరియు సుజాతనగర్ పోలీస్ సిబ్బందినీ, క్లూస్ టీం సిబ్బంది అయిన శోభన్ ను, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

71
2622 views